Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి: రాజమౌళి

Rajamouli asks Kalki 2898 AD release date
Advertisement
  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ
  • శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో గ్లింప్స్ రిలీజ్
  • వీడియో చూసి అచ్చెరువొందిన రాజమౌళి
Advertisement
ఇప్పుడెక్కడ చూసినా ప్రభాస్ కొత్త చిత్రం కల్కి 2898 ఏడీ గురించే చర్చ జరుగుతోంది. నిన్నటిదాకా ప్రాజెక్ట్ కె పేరుతో ప్రాచుర్యంలో ఉన్న ఈ హాలీవుడ్ తరహా చిత్రం ఇప్పుడు అసలైన పేరుతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. 

అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రభాస్ చిత్రం గ్లింప్స్ ను విడుదల చేశారు. దాంతో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. గ్లింప్స్ వీడియో చూస్తే హాలీవుడ్ స్టయిల్ టేకింగ్ తో అదిరిపోతోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న కల్కి 2898 ఏడీ చిత్రం ఈ గ్లింప్స్  వీడియో ఎఫెక్ట్ తో డబుల్ హైప్ తెచ్చుకుంది. 

ఈ గ్లింప్స్ వీడియో చూసిన అనంతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. 

"నాగి (నాగ్ అశ్విన్), వైజయంతీ మూవీస్ చాలా బాగా తీస్తున్నారు. భవిష్యత్ కు చెందిన కథాంశంతో నికార్సయిన సినిమా తీయడం చాలా కష్టం. కానీ మీరందరూ దీన్ని సాధ్యం చేశారు. ప్రభాస్ డార్లింగ్ లుక్స్ పరంగా చంపేస్తున్నాడు. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఇంకొక్కటి మిగిలుంది... కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 

ప్రభాస్, దీపిక పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ స్టార్లతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ హంగామా చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.
Advertisement
Advertisement
Rajamouli
Kalki 2898 AD
Prabhas
Nag Ashwin

More Telugu News